ఎస్సీ, ఎస్టీ కేసుల్లో జాప్యం వద్దు


Wed,February 20, 2019 02:44 AM

- జిల్లాస్థాయి విజిపూన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శ్రీదేవసేన
కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యాన్ని ప్రదర్శించరాదని కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిపూన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జిల్లాలో నమోదైన కేసులు, పరిష్కారానికి నోచుకున్న వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది 50 కేసులు నమోదు కాగా ₹41,1,550ను పరిహారం కింద ప్రభుత్వం మార్గ నిర్దేశకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అందించామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా పరిధిలో 91 కేసులు నమోదు కాగా, రెండు వివిధ కారణాలతో మూసేశారని చెప్పారు.

మిగతా 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిలో సైతం ఆధారాలు సరిగ్గా లేవనే కారణంతో కోర్టులు వాటిని మూసివేసే వకాశముందన్నారు. కేసుల విషయంలో పోలీసు శాఖ చట్టాలపై సామాన్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసుల ఆధారాలను పక్కాగా సేకరించి వీగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిపూన్స్ కమిటీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత అధికారులతో సమాధానం చెప్పించి వారి సందేహాలను కలెక్టర్ నివృత్తి చేయించారు. సమావేశంలో డీసీపీ సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు వెంకటరమణాడ్డి, రక్షిత కె. మూర్తి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజీవడ్డి, ఎస్సీడీపీ నాగేశ్వర్, గిరిజన సంక్షేమశాఖాధికారి గంగారామ్, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిపూన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...