రామునిపల్లిలో రేషన్‌బియ్యం ముఠా


Wed,February 20, 2019 02:44 AM

- మాటు వేసి పట్టుకున్న పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
-వివరాలు వెల్లడించిన ఏసీపీ
ఎలిగేడు : నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు కలిగి ఉన్నాయన్న సమాచారం మేరకు మంగళవారం జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో రామగుండం టాస్క్‌ఫోర్స్, జూలపల్లి సివిల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇందుకు బాధ్యులైన ఆరుగుర్ని జూలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణాడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాములపల్లిలోని గంగిద్దులకాలనీలో బత్తుల ఎల్లయ్య ఇంటిని కొందరు వ్యక్తులు కిరాయికి తీసుకుని కొంత కాలంగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పలు మండలాల్లోని గ్రామాల్లో కొన్న రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు, రామగుండం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సీఐ సరీలాల్, జూలపల్లి ఎస్‌ఐ శీలం లక్ష్మణ్ తమ సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి నిఘా పెట్టారు. అదే రోజు రాత్రి రెండు టాటా సుమోల్లో రేషన్ బియ్యాన్ని రాములపల్లిలోని గంగిద్దుల కాలనీలో గల కిరాయి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసేందుకు తరలిస్తుండగా నిఘా పెట్టిన పోలీసులు తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు.

పట్టుకున్న రేషన్ బియ్యం విలువ రూ. 2.70లక్షలు ఉంటుందని ఏపీసీ వెంకటరమణాడ్డి తెలిపారు. రెండు టాటా సుమోలతో పాటు ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వానరాసి వీరాస్వామి(దేవునిపల్లి, పెద్దపల్లి), చింతల యాదగిరి, పానంటి విక్రమ్, కడమంచి యాదగిరి, పోతర్ల శ్రీకాంత్, చింతల శ్రీనివాస్(సుల్తానాబాద్)లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచడంతో వారిని పట్టుకున్నామని చెప్పారు. గతంలో కూడా వీరిపై అక్రమంగా రేషన్ తరలించిన కేసులు నమోదయ్యాయన్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనీ, వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రామగుండం స్పెషల్ టాస్క్‌ఫోర్ సిబ్బందికి, జూలపల్లి ఎస్‌ఐ లక్ష్మణ్, పోలీసులను పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణాడ్డి అభినందించారు. ఆరు నెలల క్రితం ఎలిగేడు మండలం రాములపల్లిలోని గంగిద్దుల కాలనీలో అక్రమం నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన కూడా ఉందన్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని డీటీసీఎస్ మల్లికార్జున్‌డ్డి పంచనామా చేసి సివిల్ సప్లయ్ గోదాములకు తరలించారు. కేసు నమోదు కోసం జూలపల్లి పోలీసులకు సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సదానందం, మహేందర్, చంద్రశేఖర్, సురేందర్, ప్రకాశ్, కల్యాణ్, జూలపల్లి హెడ్‌కానిస్టేబుల్ శ్రావణ్‌కుమార్ రాజు, కానిస్టేబుల్ అతారుద్ధీర్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...