బొగ్గు ఉత్పత్తే కీలకం


Wed,February 20, 2019 02:43 AM

-డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్
-బొగ్గు ఉత్పత్తి భవిష్యత్ ప్రాముఖ్యతపై సెమినార్
రామగిరి : దేశ పురోగాభివృద్ధిలో బొగ్గు ఉత్పత్తి చేయడం కీలకంగా మారుందనీ, దేశంలో అనేక పరిక్షిశమలు బొగ్గు ఆధారితంగానే నడుస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎస్. చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంథని జేఎన్‌టీయూ కాన్ఫన్స్‌హాల్‌లో మంగళవారం ది ఇనిస్ట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా రామగుండం లోకల్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో బొగ్గు ప్రాముఖ్యత ఆధారిత పరిక్షిశమల భవిష్యత్ అనే అంశం ఒక రోజు సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్షికమాన్ని ప్రారంభించారు. ముందుగా సెమినార్‌కు సంబందించిన బ్రోచర్‌ను ఆవిష్కంచి, మాట్లాడారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్లలో, ఇతర పరిక్షిశమల్లో బొగ్గునే ఎక్కువ వినియోగిస్తూన్నారు. దీంతో పారిక్షిశామిక రంగాలో బొగ్గుకు ఎక్కువ ప్రాధన్యత నెలకొందన్నారు. దేశంలోని నదుల పరి వాహక తీరాల్లోనే బొగ్గు నిలువలు ఉన్నాయనీ ప్రస్తుత అవసరాలకు అట్టి బొగ్గును వెలికితీసి వినియోగిస్తున్నమన్నారు. ఈ భూగర్భంలో భవిష్యత్ అవసరాలకు సరిపోయేంత మినిరల్స్ నిలువలున్నాయనీ ఇది మన సహజ సంపదనేనన్నారు. భవిష్యత్‌లో పారిక్షిశామిక అవసరాలకు ఇప్పటి నుంచె తగిన కార్యచరణ జరగాలన్నారు. అందుకోసం నిఫుణులు సర్వేలు చేయాల్సిన అవసరం ఉన్నదనే అభివూపాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సెమినార్‌లో అధికారులు డాక్టర్ ఎంఎస్ వెంకవూటామయ్య, డాక్టర్ రవ్వల మార్కండేయ, కే. రాంమోహన్, హనుమకొండ వీరాస్వామి, డి. చంద్రశేఖర్, వై. రాజేశ్వర్‌డ్డి, కే. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...