సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


Mon,February 18, 2019 02:45 AM

ముత్తారం: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని టీఆర్‌ఎస్ పార్టీ ముత్తారం మండల అధ్యక్షుడు పొదిపెద్ది కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపేట గ్రామాల్లో సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆయన పుట్ట మధు ఆదేశాల మేరకు ఆదివారం అందజేశారు. ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బిల్ల శ్రీధర్‌కు రూ.33 వేలు, సీతంపేటకు చెందిన కురాకుల రవికి రూ. 7వేలు, రావుల రాజయ్యకు రూ.30వేలు, బియ్యాల రాయమల్లుకు రూ. 17వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండారి సుధాకర్, మాజీ సర్పంచ్ చెలుకల అశోక్‌కుమార్, తీర్థాల లక్ష్యయ్య, నాయకులు కెక్కర్ల శ్రీనివాస్‌గౌడ్, చంద్రగిరి దుర్గయ్య, పెట్టం లింగయ్య, అల్లం వెంకటేష్, ఓదెలు, సమ్మయ్య తదితరులు ఉన్నారు.
కమాన్‌పూర్: మండలంలోని నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన సిద్ద రాజశేఖర్‌కు రూ.26,000ల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి అందజేశారు. మండలకేంద్రంలో ఆదివారం సదరు బాధితుడికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, సర్పంచ్‌లు నీలం సరిత, తాటికొండ శంకర్, నాయకులు ఇనగంటి రామారావు, కొట్టె భూమయ్య, గుర్రం లక్ష్మిమల్లు, పొనగంటి కనకయ్య, పంతకాని రవి, మాడిశెటి శంకర్, పొట్ల శంకర్, గడప కృష్ణమూర్తి, నీలం శ్రీనివాస్, బొజ్జ రాజసాగర్, జాబు సతీశ్, మెడగోని విజయ్, పులిపాక రాయలింగు, మొండయ్య, మడిపెల్లి సాగర్‌తోపాటు తదితరులు ఉన్నారు. రామగిరి: బేగంపేట గ్రామానికి చెందిన కుంట అభిరాజుకు మంజూరైన రూ.28వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బుర్ర శంకర్‌గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో రంగం మధు, పిడుగు సతీశ్, బొగె రమేశ్, గోగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...