కోరుకంటి అవయవదానం..


Mon,February 18, 2019 02:45 AM

-సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్ణయం
-అంగీకారపత్రంపై చందర్ సంతకం
-ప్రజలు ముందుకు రావాలని పిలుపు
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ తన అవయవాలను దానం చేయడానికి ముందుకువచ్చారు. ఈ మేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీలో గల ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన అవయవదాన సంకల్ప అవగాహన సదస్సుకు కోరుకంటి చందర్ ముఖ్యఅతిథిగా హాజరై తన నేత్రాలు, అవయవాలు దానం చేస్తున్నానని ప్రకటించారు. అప్పటికప్పుడే అంగీకార పత్రంపై సంతకం చేసి ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ.. మరణానంతరం అవయవాలు మట్టిలో కలవడం వల్ల ప్రయోజనం లేదనీ, మన నేత్రాలు మరకొరికి లోకాన్ని చూపిస్తాయనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజునే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. శరీరంలోని భాగాలు వేరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తాయనీ, నియోజకవర్గ ప్రజలు కూడా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి, నరసింహాచారి, రాజమౌళి, సుధాకర్, రాజగోపాల్ త్రివేణి, అన్నపూర్ణ, కవిత, రాజమణి, టీఆర్‌ఎస్ నాయకులు కో-ఆప్షన్ సభ్యులు తస్లిమ భాను, రామస్వామి, తిరుపతి, దాసరి ఎల్లయ్య, అచ్చ వేణు, దుర్గం రాజేశం, మద్దెల శ్రీనివాస్, మేకల పోచం, వేణు, సతీశ్, అడప శ్రీనివాస్, పిల్లి రమేశ్ పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...