వైభవంగా విగ్రహప్రతిష్ఠాపన


Sat,February 16, 2019 02:43 AM

రామగుండం రూరల్ : పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియాలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో శుక్రవారం వినాయకుడు, సంతాన నాగేంద్ర, సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ గట్టు నరహరిశర్మావధాని ఆధ్వర్యంలో వేదపండితుల వేద మంత్రోచ్చరణ, భక్తుల ఆధ్యాత్మిక నామస్మరణల నడుమ కన్నులపండుగా విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. విగ్రహదాతలు లగిశెట్టి రవికుమార్, బచ్చలి నరేందర్, అడ్డాల రామస్వామి, రంగు నాగులుగౌడ్ పూజలో పాల్గొన్నారు. దాతల సహకారంతో మూడురోజుల పాటు భక్తులకు అన్నదానం నిర్వహించగా, సుజల వాటర్స్ తొడుపునూరి సత్యనారాయణ దంపతులు ఉచితంగా మంచినీరు సరఫరాచేశారు. పండితులను, దాతలను ఆలయకమిటీ చైర్మన్ కన్నూరి సతీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కలవేని మల్లేశం పూలదండ, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భక్తులు కె.సాంబయ్య, వై.లింగమూర్తి, పూదరి శ్రీనివాస్, బైరి శివకుమార్, దేవర యుగాంత్, సుధమల్ల వంశీ, పిడుగు విజయ్, హఋరాసింగ్, కలవేని వెంకటస్వామి, అనిల్, దుర్గ, కర్ర అరుణ్‌తేజ్, మర్రి హరీశ్, ఉదయ్, గోసిక అక్షయ్‌కుమార్, కె.కళ్యాణ్, పూదరి అన్వేశ్, పవన్‌సింగ్, శ్రీలత, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, ఉమ, శాంత, కె.కళ్యాణి, మానస, మౌనిక, కె.శ్రీవల్లిక, జి.మెనీల, కె.ప్రియాంక, డి. సరిత, శ్రీవాణి, యశశ్రీ, వాలంటీర్లుగా వ్యవహరించి భక్తులకు సేవచేశారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...