శాంతి భద్రతల పరిరక్షణకే..


Tue,February 12, 2019 03:03 AM

ఫెర్టిలైజర్‌సిటీ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1వ టౌన్ ఏరియాలోని విఠల్‌నగర్ దూళ్‌పేట కాలనీలో సోమవారం రామగుండం అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ఎం.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ వెళ్లి అపరిచిత వ్యక్తులున్నారా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రవికుమార్ మాట్లాడుతూ, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకే రామగుండం సీపీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి వీధుల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక టాటా మ్యాజిక్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐ వాసుదేవరావు, మహేందర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...