వైభవంగా వసంత పంచమి..


Mon,February 11, 2019 03:45 AM

-అంతటా సరస్వతీ మాత జన్మదిన వేడుకలు
-పాఠశాలల్లో చిన్నారులకు అక్షరాభ్యాసాలు
-ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మంథని, నమస్తే తెలంగాణ : చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని మంథని నియోజకవర్గవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మంథని గోదావరి తీరంలోని శ్రీ సరస్వతీ మాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అయ్యప్పస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీనారాణయ స్వామి ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు జరిపించారు. శ్రీ సరస్వతీ శిశుమందిర్, కాకతీయ, కృష్ణవేణి పాఠశాలల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేద పండితులు పెండ్యాల కృష్ణచైతన్య శర్మ, సతీష్‌శర్మ, అవధానుల లక్ష్మీనారాయణశర్మ, నాగేశ్వర శర్మల మంత్రోచ్చరణల నడుమ హోమం కాల్చారు. స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలోని శ్రీ సరస్వతీ మాతకు, పట్టణానికి చెందిన యజ్ఞంభట్ల సుశీల - ఉమాపతి దంపతులు రూ.80వేల విలువ చేసే వెండి కిరీటం, ముఖ తొడుగు, పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన సింగారపు పోచమ్మ-కిష్టయ్య దంపతులు రూ.25వేలు విలువ చేసే బంగారు ముక్కుపుడుకను అందజేశారు. వీటిని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్‌తోపాటు ఐలయ్య, చందు, ఎమ్మెస్ రెడ్డి, నందం, పోచయ్య స్వీకరించి అర్చకులు నాగేశ్వర శర్మ, భద్రయ్య స్వాముల చేత అమ్మవారికి శాస్ర్తోక్తంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో శిశు మందిర్ కార్యదర్శి జంబోజు శంకరయ్య, కనుకుంట్ల స్వామి, కొమురవెళ్లి తిరుపతయ్య, ప్రధానాచార్యులు కనకం అంజయ్య, ఉపాధ్యాయులు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కమాన్‌పూర్ : వసంత పంచమిని పురస్కరించుకొని స్థానిక ఆపిల్ కిడ్స్ పాఠశాలలో అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆదివరాహా స్వామి ఆలయంతోపాటు జూలపల్లిలోని మల్లిఖార్జున స్వామి, వరాలమ్మ ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
రామగిరి : కల్వచర్ల గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఆదివారం వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 45 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ముత్తె చంద్రమౌళి, ప్రధానోపాధ్యాయుడు బర్ల శ్రీనివాస్, డైరెక్టర్లు విజయలక్ష్మి, రవికుమార్, రాంచందర్, సదయ్య పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...