కాసులపల్లిలో దాసరి పద్మకే మద్దతు


Tue,January 22, 2019 01:57 AM

-మూకుమ్మడిగా ప్రకటించిన మిగతా అభ్యర్థులు
-అభినందించిన ఎమ్మెల్యే మనోహర్
కలెక్టరేట్ : పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దాసరి పద్మ కు మద్దతు ప్రకటిస్తూ ఆ గ్రామంలోని మిగతా అభ్యర్థులు నిర్ణయం తీసుకున్నారు. 1162 మంది ఓటర్లున్న కాసులపల్లి గ్రామం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఇక్కడ పోటీ చేసేందుకు ఆరుగురు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఈ నెల 11 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 13న ముగిసే వరకు సర్పంచ్ అభ్యర్థులుగా ఇనుగాల రమాదేవి, ఇనుగాల సుజాత, దాసరి పద్మ, ఎర్రం సౌజన్య, యాంసాని లక్ష్మి, శివాల సునీత తమ నామినేషన్లను దాఖలు చేశారు. 14న పరిశీలన అనంతరం 17న జరిగిన ఉపసంహరణ రోజు ఇనుగాల సుజాత, శివాల సునీత వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపధ్యంలో పలుమార్లు గ్రామస్తులు, స్థానిక నాయకులు ఏకగ్రీవం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పోటీ అనివార్యమైంది. అలాగే కాసులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 10వార్డు స్థానాలు ఉండగా, అన్ని వార్డు స్థానాలు ఉపసంహరణల నాటికి ఏకగ్రీవం కాగా, 7వ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన ఆవునూరి మల్లేశం, గద్దల రాజులు పోటీలో ఉండడంతో ఇక్కడ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో సర్పంచ్ స్థానానికి ఇనుగాల రమాదేవి, దాసరి పద్మ, ఎర్రం సౌజన్య, యాంసాని లక్ష్మి సర్పంచ్ పదవికి పోటీలో ఉండి ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గ్రామస్తులందరి సమష్ఠి నిర్ణయం మేరకు ఎవరో ఒకరికే మద్దతు తెలిపి గెలిపించుకోవాలని తేల్చి చెప్పడంతో సర్పంచ్ బరిలో ఉన్న దాసరి పద్మనే మా సర్పంచ్ అభ్యర్థి అని నిర్ణయించుకున్న మిగతా పోటీదారులు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఎన్నికలు అనివార్యం కావడంతో మూకుమ్మడిగా పద్మకే ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చినందుకు గ్రామాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ హామీ ఇచ్చారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...