ఆకట్టుకున్న ‘లిటరరీ ఫెస్టివల్’


Tue,January 22, 2019 01:57 AM

ధర్మారం : ధర్మారం మండలం మల్లాపూర్ తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల విద్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘లిటరరీ ఫెస్టివల్ -2019’ ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలు, విద్యాలయాల్లో చదువుతున్న 890 మంది విద్యార్థులు తరలి వచ్చారు. ఈ ఉత్సవాలను గురుకులాల కరీంనగర్ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గురుకులాల కార్యదర్శి ఆర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు. పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ‘రంగవల్లులు, జానపద నృత్యాలు, పుస్తక పఠనంపై సమీక్ష, సినిమాపై సమీక్ష, చేతి రాత, నాటిక, గ్రామెటిక్ రీడింగ్, గ్రూపు సాంగ్స్, ఫ్యాషన్ షో, కథలు చెప్పడం, మీట్ ఏ క్యారెక్టర్, పొమెట్రి స్లామ్’ తదితర అంశాలపై పోటీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మల్లాపూర్ విద్యాలయం ప్రిన్సిపాల్ సీహెచ్ గిరిజ అధ్యక్షత వహించగా, గురుకులాల అసిస్టెంట్ రీజినల్ కోఆర్డిటనేటర్ సూర్య ప్రకాశ్, పెద్దపల్లి, జగిత్యాల,కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కోఆర్డినేటర్లు జ్యోతి చంద్రకళ, దేవేందర్ మధుర సరళ, జాక్లిన్, ఆయా జిల్లాలకు చెందిన ప్రిన్సిపాళ్లు, మల్లాపూర్ వైస్ ప్రిన్సిపాల్ శారద, పెద్దపల్లి జిల్లా టీజీపీఏ అధ్యక్షుడు అక్కపాక నరేశ్, మల్లాపూర్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇరుగురాల అజయ్, విద్యాలయం అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...