ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి


Tue,January 22, 2019 01:57 AM

-తహసీల్దార్ శ్రీనివాస్
కలెక్టరేట్: ఈనెల 25న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలనీ, ఎన్నికల కమిషన్ నిబంధనలు అతిక్రమిస్తే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రంగంపల్లిలో గల సాయిగార్డెన్స్ సోమవారం ఎంపీడీఓ ఎం.రాజు ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థులంతా నడుచుకోవాలని మండలంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సహకరించాలని కోరారు. ంపీడీఓ రాజు మాట్లాడుతూ, పోటీ చేస్తున్న అభ్యర్థులు కమిషన్ నిబంధనల మేరకే ఖర్చు చేసుకోవాలనీ, వాటిని అతిక్రమించి ఖర్చు చేస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశముంటుందన్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలను అభ్యర్థులంతా లెక్కల్లో చూపించాలనీ, లేనిపక్షంలో భవిష్యత్తులో పోటీకి అనర్హులుగా ప్రకటించబడుతారని తెలిపారు. ఎస్ ఉపేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. ప్రచారంలో వాడే వాహనాలకు, మైక్ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలనీ, లేకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందనీ, అభ్యర్థులు అధికారులకు సహకరిస్తూనే ప్రచారం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, ఎన్నికల ఖర్చుల పరిశీలనాధికారి సుమిత్ర, సర్పంచ్, వార్డుస్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...