కొలనూర్ ఆలయాల్లో దుండగుల బీభత్సం


Tue,January 22, 2019 01:57 AM

-విఘ్నేశ్వరుడి విగ్రహం చోరీ, బీరువా ధ్వంసం
-ఆందోళనలో గ్రామస్తులు
ఓదెల: మండలంలోని కొలనూర్ గ్రామంలోని అతి పురాతన దేవాలయమైన శివాలయంలోని వినాయకుడి రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి అపహరించారు. అలాగే అభయాంజనేయస్వామి ఆలయంలోని బీరువాను పగులగొట్టి అందులోని వస్తు, సామాగ్రిని చిందరవందర చేశారు. ఊర చెరువు వద్ద ఉండే మైసమ్మ గద్దెను ధ్వంసం చేశారు. విషయం తెలియడంతోనే పొత్కపల్లి పోలీసులు సుధాకర్, రవి కొలనూర్ గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపారు. కాగా ఊరచెరువు కట్ట తూము నీటిలో చోరీకి గురైన వినాయకుడి విగ్రహం దొరికింది. విగ్రహాన్ని తూము నీటిలోంచి తీసి భద్రపర్చారు. వరుసగా విగ్రహాలను ద్వంసం చేస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితమే కొలనూర్ గ్రామంలోని మైసమ్మ విగ్రహాం ధ్వంసం చేయగా, ఆ మరుసటి రోజు ఉప్పరపల్లి గ్రామంలో శివగట్టు మల్లికార్జునస్వామి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. పక్షం రోజుల్లో ఆలయాలపై పలుమార్లు దాడులు జరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ఎవరి పనా అనేది పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమవడం ప్రజలను కలవరపరుస్తుంది.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...