శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు


Mon,January 21, 2019 12:42 AM

కమాన్‌పూర్: జిల్లాలో మొదటి విడతలో చేపట్టనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో శాంతి భధ్రతలకు విఘాతం ఎవరు కలిగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ హెచ్చరించారు. కమాన్‌పూర్ పోలీసుస్టేషన్ ఆవరణలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ విధించామని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 30వ తేదీ దాకా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు అభ్యర్థులుగా గెలిచిన వారు ఎన్నికల నియమావళి ప్రకారంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. పోలీసుశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులు, వారి అనుచరులు ఉండాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని, పాలకుర్తి, అం తర్గాం మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎన్నికలకు సజావుగా నిర్వహించేందుకు సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో చేపట్టేందుకు పోలీసుశాఖలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల అధికారుల అనుమతి కలిగిన వారిని మాత్రమే పంపిస్తామని స్పష్టం చేశారు. వికలాంగులు, చిన్న పిల్లలను ఉన్న మహిళలు, వృద్ధులకు సహాయకంగా ఒక్కరిని అనుమతిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా.. సర్పంచ్, వార్డు సభ్యులగా పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు పోలీసు సిబ్బందికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో గోదావరిఖని టూటౌన్ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లుతో పాటు ఎస్‌ఐలు అనవేన మల్లేశం, బొంతల సత్యనారాయణ ఉన్నారు.

భారీ బందోబస్తు ..
ముత్తారం/అంతర్గాం: గ్రామపంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ బూతులోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారం మేరకు రాత్రివేళలో పెట్రోలింగ్ పెంచామని తెలిపారు. మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా చేపట్టేందుకు సిబ్బందికి సూచనలు ఇచ్చామని వివరించారు. సమావేశంలో ముత్తారం ఎస్‌ఐ రాజ్‌కుమార్‌గౌడ్, సుల్తాన్‌బాద్ ఎస్‌ఐ రాజేశ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేట, అంతర్గాం, గోలివాడ, రాయదండి తదితర పోలింగ్ కేంద్రాలను డీసీపీ సందర్శించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ రవికుమార్, సీఐ బుద్ధె స్వామి, ఎస్‌ఐ రామకృష్ణ తదితరులున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...