‘తొలి’ ఎన్నికకు రెడీ


Sun,January 20, 2019 02:30 AM

-రేపే మొదటి విడత పంచాయతీ పోరు
-అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
-బరిలో 2,628 మంది అభ్యర్థులు
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ:మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. మం థని, రామగిరి, ముత్తారం, కమాన్ పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో జరిగే ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తొలి విడత ఎన్నికల కోసం 2,605 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఇందులో పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 1,154 మంది కాగా, ఇతర 1,451 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఆరు మండలాల్లో 19 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు, 27 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా, 8 అత్యంత సున్నితమైనవిగా, 52 గ్రామ పంచాయతీలు ఎలాంటి సమస్యలు లేని గ్రామ పంచాయతీలుగా నిర్ధారించగా, ఈ మేరకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఒక పో లింగ్ కేంద్రంలో వెబ్ నిర్వహిస్తున్నారు.

బరిలో 2628 మంది అభ్యర్థులు..
తొలి విడత ఎన్నికల్లో 2628 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరు మండలాల్లోని 106 జీపీలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ముత్తారం మండలం ఓడేడు, రామగిరి మండలం జల్లా రం, మంథని మండలం విలోచవరం సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మంథని మండలంలోని ఒక జీపీ ఏకగ్రీవం కావడంతో 33 గ్రామ పంచాయతీలకు 146 మంది బరిలో ఉన్నారు. ముత్తారం మండలంలోని ఒక జీపీ ఏకగ్రీవం కావడంతో 13 జీపీలకు 57 మంది, రామగిరి మండలంలో ఒక జీపీ ఏకగ్రీవం కావడంతో 15 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 61 మంది బరిలో ఉన్నారు. కమాన్ 9 జీపీలలో సర్పంచ్ స్థానాలకు 43 మంది, ఇక పాలకుర్తి మండలంలోని 19 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 104 మంది, అంతర్గాం మండలంలో ఒక జీపీ ఏకగ్రీవం కావడంతో 13 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 64 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 102 సర్పంచ్ స్థానాలకు 475 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఆయా పంచాయతీల్లో 962 వార్డులుండగా, ఇందులో 166 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 796 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 2,153 మంది బరిలో ఉన్నారు.

మొత్తం 1,43,744 మంది ఓటర్లు..
తొలి విడత ఎన్నికలు గ్రామాల పరిధిలో మొ త్తం 1,43,744 మంది ఓటర్లు ఉన్నారు. ఇం దులో 72,711 మంది పురుష ఓటర్లు కాగా, 71,017 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మూడో రకానికి చెందిన వారు 16 మంది ఉన్నా రు. అంతర్గాం మండలంలో 14,837 మంది ఓటర్లు ఉండగా, 7,460 మంది పురుషులు, 7377 మంది మహిళలు ఉన్నారు. కమాన్ మండలంలో 18,439 మంది ఓటర్లు ఉండగా, 9,326 మంది పురుషులు, 9,113 మంది మహిళలు ఉన్నారు. మంథని మండలంలో 30,620 మంది ఓటర్లు ఉండగా, 15,279 మంది పురుషులు, 15,339 మహిళలు, ఇద్దరు మూడో రకానికి చెందిన ఓటర్లు ఉన్నారు. ముత్తారం మండలంలో 19,835 మంది ఉం డగా, 9,932 మంది పురుషులు, 9,942 మం ది మహిళలు, 11 మంది మూడో రకానికి చెంది న ఓటర్లు, పాలకుర్తి మండలంలో 29,647 మంది ఉండగా, 15,087 మంది పురుషులు, 14,557 మంది మహిళలు, మూడో రకానికి చెందిన ఓటర్లు ముగ్గురు ఉన్నారు. రామగిరి మండలంలో 30,316 మంది ఉండగా, 15,627 మంది పురుషులు, 14,689 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి..
ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. నేడు (ఆదివారం) వారి కేటాయించిన గ్రామాలకు చేరుకోనుండగా, సిబ్బందిని ఉదయం 10గంటలకు ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓలకు రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మొదటి విడత ప్రచారానికి తెర
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ అయింది. మంథని, రామగిరి, కమాన్ ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల పరిధిలోని 106 గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 9 వరకు నామినేషన్లు స్వీకరించి, 10న పరిశీలించారు. 13న ఉపసంహరణకు అవకాశమిచ్చారు. 4 సర్పంచ్ స్థానాలు, 166 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 102 సర్పంచు స్థానాలకు 475 మంది, 796 వార్డులకు 2,153 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపసంహరణ తర్వాత గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు జోరు పెంచారు. ఈ నెల 14 నుంచి ఆరు రోజులపాటు ప్రచారంతో హోరెత్తించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల విన్యాసాలు చేశారు. ఇంటింటికీ తిరిగి, తాము ఏం చేయబోతామో వివరించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకారం 44 గంటల ముందే ప్రచారాన్ని నిలిపి వేయాల్సి ఉండగా. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగించారు. శనివారం సాయంత్రం నుంచే మొదటి విడత మండలాల్లో లిక్కర్ షాపులు మూయించారు. ఎన్నికలు జరిగే మంథని, కమాన్ ముత్తారం, రామగిరి, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...