విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి


Sun,January 20, 2019 02:29 AM

-సీజీఆర్ వరంగల్ ఫోరం చైర్మన్ కందుల కృష్ణయ్య
ఎలిగేడు: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల ఫోరం కృషి చేస్తుందని సీజీఆర్ వరంగల్ ఫోరం చైర్ కందుల కృష్ణయ్య అన్నారు. మండలకేంద్రంలోని విద్యుత్ సబ్ శనివారం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం, నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందకపోతే ఫోరానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే కరెంట్ బిల్లుల తప్పొప్పులు, లూజువైర్లు, కరెంట్ మీటర్లలో తలెత్తే సమస్యలు, ట్రాన్స్ ఓవర్ సమస్య తదితర వాటిపై తమ ఫోరానికి వినియోగదారులు రాతపూర్వకంగా లేదా టోల్ నెంబర్ 1912లో సంప్రదించవచ్చన్నారు. ట్రాన్స్ ఎస్ బీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గృహ, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గృహ వినియోగదారులు, రైతులు, తమకు విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలుంటే నేరుగా విద్యుత్ అధికారులను సంప్రదించవచ్చన్నారు. అనంతరం విద్యుత్ వినియోగదారులు అడిగిన పలు కరెంట్ సమస్యలు, సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఫోరం సభ్యులు ఆర్ చరణ్ కే ఈశ్వరయ్య, ఇండిపెండెంట్ మెంబర్ ఈ గణపతిరెడ్డి, డీఈ లక్ష్మారెడ్డి, సుల్తానాబాద్ ఏడీఈ శ్రీనివాస్, మండల ట్రాన్స్ ఏఈ ఏ రాకేశ్, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...