మెరుగైన వైద్యసేవలందించాలి


Sun,January 20, 2019 02:29 AM

కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చాలనీ, ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీదేవసేన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కంటివెలుగు, కేసీఆర్ కిట్టు, ఎన్ టీబీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కంటివెలుగు కార్యక్రమాన్ని 20 బృందాలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణలో జిల్లా పదోస్థానంలో ఉందని తెలిపారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేసి మరింత వేగంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో ఆపరేషన్లతో కూడిన ప్రసవాలు జరగడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండటం పట్ల వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు నియమించిన ప్రత్యేకాధికారులు తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు.

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులపై సర్వే చేసి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గర్భిణీలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు చేయించుకునేలా వారిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు పీహెచ్ సందర్శిస్తూ వైద్య ఆరోగ్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆపరేషన్ల సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచడంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లాలో మూడు మాతా శిశు సంరక్షణ కేంద్రాలు పెద్దపల్లి, మంథని, రామగుండంలో నిర్మిస్తున్నామన్నారు. వాటిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించా రు. పదిరోజులకొకసారి జిల్లా కార్యాలయంలో సాధారణ ప్రసవాలపై సమీక్ష నిర్వహించాలన్నా రు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్ రాష్ట్ర ప్రోగ్రామ్ అధికారి జగన్నాధరెడి,్డ వైద్యాధికారులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...