ఆఖరి విడత 3,267 నామినేషన్లు


Sat,January 19, 2019 02:27 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సుల్తానాబాద్, ఎలిగేడు, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 81 జీపీలు, 756 వార్డులకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. మొత్తంగా మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 713, వార్డు స్థానాలకు 2,554 నామినేషన్ల వచ్చాయి. ఇక చివరి రోజైన శుక్రవారం 429, వార్డు స్థానాలకు 1476 వచ్చాయి.
ఆఖరి రోజు జోరుగా..
సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలుండగా, సర్పంచ్ స్థానాలకు చివరి రోజు 146 నామినేషన్లు వచ్చాయి. జూలపల్లి మండలంలో 13 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 44 మంది, ఎలిగేడు మండలంలో 12 జీపీల సర్పంచ్ స్థానాలకు 74 మంది, ధర్మారం మండలంలోని 29 జీపీల సర్పంచ్ స్థానాలకు 165 మంది నామినేషన్లు వేశారు.
వార్డు స్థానాలకు..
సుల్తానాబాద్ మండలంలోని 246 వార్డు స్థానాలకు చివరి రోజు 497 మంది నామినేషన్ వేశారు. జూలపల్లి మండలంలోని 130 వార్డు స్థానాలకు 215 మంది, ఎలిగేడు మండలంలో 114 వార్డు స్థానాలకు 273 నామ ప్రతాలు వచ్చాయి. ధర్మారం మండలంలోని 266 వార్డు స్థానాలకు 491 నామినేషన్లు దాఖలయ్యాయి.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...