రెండో రోజూ నామినేషన్ల జోరు..


Fri,January 18, 2019 12:58 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండోరోజూ నామినేషన్ల జాతర కొనసాగింది. దాఖలు కోసం అభ్యర్థులు అనుచరగణంతో తరలిరాగా, రిటర్నింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొన్నది. జిల్లాలోని సుల్తానాబాద్, ఎలిగేడు, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 81 గ్రామ పంచాయతీలు, 756 వార్డులకు అధికారులు రెండో రోజూ నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 177 మంది, వార్డు స్థానాలకు 867 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు 58 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, జూలపల్లి మండలంలోని 13 పంచాయతీలకు 28 మంది నామపత్రాలను సమర్పించారు. ఎలిగేడు మండలంలోని 12 పంచాయతీలకు 31 మంది, ధర్మారం మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు 60 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 81 సర్పంచ్ స్థానాలకు రెండు రోజుల్లో 284 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేశారు.

వార్డు స్థానాలకు 867 మంది..
మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న 756 వార్డు స్థానాలకు రెండవ రోజు 867 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సుల్తానాబాద్ మండలంలోని 246 వార్డు స్థానాలకు 257 మంది, జూలపల్లి మండలంలోని 129 వార్డు స్థానాలకు 206 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. ఎలిగేడు మండలంలోని 102 వార్డు స్థానాలకు 135 మంది, ధర్మారం మండలంలోని 266 వార్డు స్థానాలకు 269 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు దాఖలు చేశారు. 756 వార్డు స్థానాలకు గాను రెండు రోజుల్లో 1078 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడో విడత నామినేషన్ల స్వీకరణకు నేడే చివరి రోజు కావడంతో, పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...