పండుగలా గణతంత్ర వేడుకలు


Fri,January 18, 2019 12:58 AM

కలెక్టరేట్: ఈ నెల 26వ తేదీన నిర్వహించే గణతంత్ర వేడుకలు పండుగను తలపించేలా ఉండాలనీ, అందుకోసం ఏర్పాట్లు అట్టహాసంగా చేయాలని జాయింట్ కలెక్టర్ వనజాదేవి అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. జిల్లా స్థాయి వేడుకలకు పెద్దకల్వల క్యాంపు ఆవరణలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రముఖులను వేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. వేడుకల ఆహ్వాన పత్రికల్లో ప్రొటోకాల్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపిక చేయాలనీ, దేశభక్తిని చాటే మంచి కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వచ్చే వివిధ పథకాలను పంపిణీ చేసేందుకు శాఖల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం శకటాలతో స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎట్ హోం కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని అధికారులకు జేసీ వనజాదేవి సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో కె.నర్సింహమూర్తి, ఇన్‌చార్జి డీఆర్డీవో ప్రేమ్‌కుమార్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...