సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ


Tue,January 15, 2019 05:34 AM

-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
-బస్టాండ్ కాలనీలో రంగవల్లుల పోటీలు
-విజేతలకు బహుమతుల ప్రదానం
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం నగరంలోని బస్టాండ్ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ తర్వాత సంక్రాంతి పండుగలో మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేసి జరుపుకుంటారన్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసే సంస్కృతి మన దగ్గరే ఉందనీ, మహిళలు శారీరకంగా, మానసికంగా ఉండేందుకు దోహద పడుతుందన్నారు. పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సందర్భంగా పలువురు యువతులు, మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి మౌనిక, ద్వితీయ పుష్పలీల, తృతీయ సరిత అందుకున్నారు. ఇక్కడ అచ్చ వేణు, కోటగిరి పాపయ్య, కొండాల్‌రెడ్డి, తిరుపతి, కోటేశ్వర్లు, చరణ్, అరవింద్, సందీప్, నరేశ్, రాజిరెడ్డి, కృష్ణ, సత్యనారాయణ, శేఖర్ తదితరులు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...