ఘనంగా భోగి వేడుకలు


Tue,January 15, 2019 05:31 AM

-ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించిన
- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
సుల్తానాబాద్: సుల్తానాబాద్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేసిన భోగి వేడుకలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, మహిళలు, చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుకలను అంగరంగా వైభవంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. రైతులు, మహిళలు ఇష్టంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని, చెడును దూరం చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని చేసుకునే పండుగ అన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు పిల్లాపాపలతో వచ్చి వైభవంగా జరుపుకుంటారనీ, ఇలాంటి వేడుకలు భవిష్యత్ తరాలకు తెలిసేలా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే దాసరి ప్రత్యేకంగా అభినందించారు. హరిదాసుల కీర్తనలు చుద్దామంటే కనపడే పరిస్థితి లేదనీ, సుల్తానాబాద్‌లో 8 మంది హరిదాసులతో కీర్తనలు చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు.
స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడు అకుల కన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎండ్ల బండిపై ఎమ్మెల్యేకు స్వాగతం పలుకడం ప్రత్యేక అకర్షణగా నిలిచింది. భోగి వేడుకలను అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు అయిల రమేశ్, గాజుల రాజమల్లు, శ్రీగిరి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, కాంపెల్లి నారాయణ, తిప్పారపు దయాకర్, సూరశ్యాం, పల్లా సురేష్, జాపతి రాజిరెడ్డి, అనుమాల బాపురావు, కన్నె చంద్రయ్య, పారుపెల్లి సజయ్, తుమ్మ రాజ్‌కుమార్, చిలగాని విశ్వనాథ్, పురం రమణ, బొల్లి నగేష్, బోయిని ముత్యాలు, కొట సురేందర్, పల్లా అపర్ణ, అనుమాల అరుణ, నీతారెడ్డి, చిలగాని దీప, భాదం వాణి, చిలగాని కరుణ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...