ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి


Mon,January 14, 2019 03:54 AM

గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ట్రాక్టర్ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం చేపట్టగా, ఆయన హాజరై మాట్లాడుతూ, ప్రజల అవసరాలను తీరుస్తున్న ట్రాక్టర్ యజమానుల గోలివాడ నుంచి ఇసుక తెచ్చేందుకు ఒక ట్రాక్టర్ 2700 నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుందనీ, మేడిపల్లి నుంచి తీసుకవస్తే వెయ్యి నుంచి 1300 లోపు ఖర్చు అవుతుందని వివరించా రు. దీనిని పరిశీలించి న్యాయం చేయాలనీ, ఇటీవల కలెక్టర్ మాట్లాడినట్లు పేర్కొ న్నారు. మరోసారి మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను సన్మానించి ఇక ముందు వృథా ఖర్చులు చేయవద్దనీ, తనకు దండలు, శాలువాలు వేసి సన్మానించే బదులు ఆ డబ్బులతో పేద లు, అనాథలకు సాయపడాలని ఆయన కోరారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అమ్మ పరివార్ ఆశ్రమానికి 25 కిలోల బియ్యం అందించారు. కార్యక్రమంలో యజమానుల సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రాంరెడ్డి, ఆరెపల్లి హరీశ్, మేకల రాజయ్య, సలీం, బొడ్డు రవీందర్, పొగాకుల కొంరయ్య, శ్రీనివాస్, టీఆర్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, మంథని సంపత్, మెతుకు దేవరాజ్, శ్రీనివాస్, సురేశ్, అక్బర్, మేకల పోచం తదితరులున్నారు.

ఒడిశా కార్మికులకు అన్ని రకాల సేవలు
గోదావరిఖని ఎన్టీఆర్ నగర్ నివసిస్తున్న ఒడిశా కార్మికులకు ప్రభుత్వ పరంగా వచ్చే పింఛన్లు అన్ని రకాల సేవలను వారికి అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. 30 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న వీరికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందనీ, ఆ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు సేవ చేయడమే టీఆర్ ప్రభుత్వం ఉద్దేశ్యమనీ ఆయన స్పష్టం చేశారు. 33వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఒడిశా సంఘం వారికి ఎన్టీపీసీకి చెందిన వేణు మలాన్ అన్నదానం చేశారు. కార్యక్రమంలో పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ మేరుగు నరేశ్, దేవానంద్ దుర్గ నట్వర్ మెతుకు దేవరాజ్, పిల్లి రమేశ్ తదితరులున్నారు.

గోదా రంగనాయకుల కల్యాణం
ఫెర్టిలైజర్ ధనుర్మాసం పురస్కరించుకొని గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగ నాయకుల వివాహాన్ని ఆలయ పండితుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతా మూర్తులను అలంకరించి వేడుకలను చేపట్టారు. అనంతరం ఆలయంలో గోదా రంగనాయకుల స్వాములను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇక్కడ బీ.శ్రీనివాస్, గోటిక శ్రీనివాస్, రాజయ్య, లక్ష్మణ్, శంకర్, కృష్ణ, అశోక్ కంటేశ్వరరావు తదితరులున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...