కలప స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా


Mon,January 14, 2019 03:53 AM

-అటవీ శాఖకు సంపూర్ణ సహకారం
- సీపీ సత్యనారాయణ
ఫెర్టిలైజర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలప అక్రమ రవాణాకు పాల్పడుతూ అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామనీ రామగుండం సీపీ సత్యనారాయణ ప్రకటించారు. ఈమేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం అటవీ శాఖ అ ధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ శాఖ, అటవీ శాఖ సమన్వయం కలిపి పని చేస్తున్నారన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో కలపను అక్రమంగా తరలించిర వారిని కఠినంగా శిక్షిస్తా మని చెప్పారు. అడవులను ధ్వంసం చేస్తు స్మగ్లర్లపై పోలీస్, అటవీ శాఖ ప్రత్యేక నిఘా ఉంచి వారి కార్యకలాపాలు పసిగడుతున్నామన్నారు. దాడులు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్, అట వీ శాఖకు సహకరిస్తామన్నారు. తరచుగా అటవీ నేరాలకు పాల్పడే వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంలో అటవీ నేరాల అదుపుకు అటవీ శాఖకు పూర్తి స హాయ సహకారాలు అందిస్తామన్నారు. అటవీ నే రాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నా రు. ఇక్కడ డీసీపీ సుదర్శన్ గౌడ్, అడిషనల్ డీసీపీ అశోక్ రవికుమార్, ఏసీపీ రక్షిత మూర్తి, పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణారెడ్డి, మంథని సీఐ నటేష్, టాస్క్ సీఐలు సాగర్, సురేందర్, రవి ప్రసాద్, డీఎఫ్ నాగయ్య, అటవీ శాఖ అధికారి తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...