కమ్మేసింది..


Sun,January 13, 2019 02:33 AM

-జిల్లాను అలుముకున్న పొగమంచు
-ఉదయం పది గంటలైనా అదే పరిస్థితి..
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/జూలపల్లి/సుల్తానాబాద్/ఓదెల/రామగిరి/ధర్మారం: జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దట్టమైన పొగమంచు ఆవరించింది. వాహనదారులు పగలూ లైట్లు వేసుకుని వెళ్లారు. జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథ ని, రామగుండం, సుల్తానాబాద్, ధర్మారం, కాల్వశ్రీరాంపూర్, రామగిరి తదితర ప్రాం తాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విధులకు హాజరయ్యే సింగరేణి, ఎన్టీపీసీ కార్మికులు, ఉద్యోగులతోపాటు పాలు, కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులు, టీ, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 10గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. కాజీపేట-బల్లార్ష మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. జూలపల్లి మండలంలో రోడ్ల వెంట మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలు నిలిచాయి. సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఉదయం 10గంటలైనా బ యటకు రాలేదు. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లడం కనిపించింది. ఓదె ల మండలంలోని పలు గ్రామాల్లో అధికంగా మంచు కురిసింది. రేకుల ఇండ్ల పైకప్పు నుం చి నీటి చుక్కలు పడినట్లు పలువురు తెలిపారు. అనేక చోట్ల చలి మంటలు వేసుకున్నారు. సిగ్నల్స్ సరిగా కనిపించక ఓదెల మార్గం గుండా రైళ్ల వేగం తగ్గింది. రామగిరి మండలంలో ప్రజలెవరూ ఉదయం పది గంటలు దాటినా బయటికి రాలేదు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...