వైద్యుల కొరత తీర్చేందుకు కృషి


Sun,January 13, 2019 02:31 AM

-ఎమ్మెల్యే కోరుకంటి చందర్
-సింగరేణి ఏరియా దవాఖాన సందర్శన
గోదావరిఖని, నమస్తే తెలంగాణ: గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానలో వైద్యుల కొరత తీర్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కోరుకంటి శనివారం గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో కలియతిరిగి ఆయన పలు విషయాలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలనే విషయాన్ని సింగరేణి సీఎం డీ నడిమెట్ల శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లాననీ, ప్రభుత్వం సహకారంతో పరిష్కరిస్తానని వివరించారు. అనంతరం చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పి.సుజాత, సూపరింటెండెంట్ బాలకోటయ్య, డాక్టర్లతో కలిసి దవాఖానలోని ఆపరేషన్ థియేటర్, పోస్టు వార్డు, మెడికల్ స్టోర్ రూం, క్యాంటీన్లతో పాటు బ్లడ్ బ్యాంకు కోసం నిర్దేశించిన భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సింగరేణి ఏరియా దవాఖానలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. సరైన సిబ్బంది, ఫిజిషియన్లు లేరని చెప్పారు. ప్రతి గనిపై ప్రథమ చికిత్స కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ, గదిని కేటాయించి కార్మికులకు అక్కడి కక్కడే ప్రాథమికంగా వైద్య సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. ఏకైన సింగరేణి ఏరియా దవాఖానకు పెద్ద సంఖ్యలో కార్మికులు, వారి కుటుంబీకులు రావడంతో తగినంత మంది వైద్యులు లేకపో వడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలందరికి అందుబాటులో ఉండేలా సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్లు నాయక్, బి.రవీంద్ర, రాజేశ్వర్ టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ రత్నమాల, యాదవరెడ్డి, టీఆర్ నాయకులు తోడేటి శంకర్ బొడ్డు రవీందర్, ముప్పు సురేశ్, పిల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...