విజయమ్మ ఆశయం నెరవేరుస్తా..


Sat,January 12, 2019 03:10 AM

-ట్రస్టు ద్వారా పేదలకు సాయమందిస్తా
-ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: తన జీవిత భాగస్వామి చివరిదాకా కోరుకున్నది తాను నెరవేరుస్తాననీ, ఆమె పేరు మీద ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సాయం చేస్తూ అండగా ఉంటానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈమేర కు శుక్రవారం కోరుకంటి విజయ జయంతి సందర్భంగా గోదావరి నది తీరాన గల ఆమె శ్మశాన వాటిక వద్ద కూతు రు ఉజ్వల, కొడుకు మణిదీప్ కలిసి నివాళుల ర్పించారు. ఇక్కడ ఎమ్మెల్యే తన సతీమణి విజయమ్మను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టారు. ఇవాళ నియోజక వర్గ ప్రజలు తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ సమయంలో విజయమ్మ తన నుంచి వెళ్లిపోవడం తట్టు కోలేకపోతున్నాన్నారు. తాను పేదలకు సేవ చేయాలని తన భాగస్వామి ఎంతో కోరుకుందనీ, ఇవాళ అది నెరవేరిన సందర్భంలో ఆమె లేకపోవడం కలచివేస్తుం దన్నారు. ఆమె ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకు లు ఎదురైనా తప్పకుండా ప్రజా సేవ చేస్తానని పేర్కొ న్నారు. ఈయన వెంట పలువురు టీఆర్ నాయకులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...