కూటమిని కాటికి పంపడం ఖాయం


Tue,November 20, 2018 01:12 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ: అధికారం కోసం జత కట్టిన కూటమిని కాటికి పంపడం మాత్రం ఖాయమని టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని సంజయ్‌నగర్, వెంకటేశ్వర స్కూల్ ఏరియా, మారుతీ నగర్, లక్ష్మీనగర్ వ్యాపార కూడలిలోని వీకే రెడ్డి టీస్టాల్, సీటీ స్కాన్ వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రామగుండం ప్రాంతంలో కొంతమంది మోసపూరిత నాయకులు ముందుకు వస్తున్నారనీ, నేర చరిత కలిగిన వారంతా జత కడుతున్నారనీ, అలాంటి వారికి అధికారం ఇస్తే అభివృద్ధిలో మళ్లీ వెనక్కిపోక తప్పదని వివరించారు. తాను మొదటి నుంచి నిజాయతీగా, నిబద్ధతతో ఏలాంటి ఆరోపణలకు తావు లేకుండా సేవ చేస్తున్నానని తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తన ఆకాంక్షను గుర్తించి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రెండింతల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను అధికారంలో ఉన్న కాలంలో ఏ ఒక్క వ్యాపారిని ఏలాంటి చందా కూడా అడగలేదనీ, నిస్వార్థంగా వారి ఎదుగుదల కోసం కృషి చేశానని వివరించారు. దీంతో వ్యాపారులంతా తనకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ జాలి రాజమణి, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్లు వనం శివానందం, కోదాటి ప్రవీణ్, దాసరి ఉమా సాంబమూర్తి, వడ్లూరి రవి, బాలసాని స్వప్న తిరుపతి, నాయకులు మేకల సదానందం, నీరటి శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, గోసిక సత్యం, బొల్లెన శ్రీధర్, అక్రం, అనిల్, సంపత్, మోటు, చంద్రమోహన్, రంగు శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రేణుల్లో మరింత ఉత్సాహం..
సోమారపు సత్యనారాయణ సోమవారం గోదావరిఖనిలోని వివిధ ప్రాంతాల్లో ఒకే రోజు భారీగా రోడ్‌షోలు నిర్వహించారు. దీంతో భారీగా జనం తరలిరావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరిం త ఉత్సహం వ్యక్తమైంది. గోదావరిఖనిలోని వివి ధ ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌షోలకు భారీగా ప్రజలు తరలిరావడం, మహిళలు మంగళహారతులతో సోమారపునకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. గోదావరిఖనిలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగిన రోడ్‌షోలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ సోమారపు ఓట్లు అభ్యర్థించారు. సంజయ్‌గాంధీ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం 10:45 గంటలకు 27వ వార్డులోని రాజీవ్‌నగర్‌లోని వెంకటేశ్వర్ స్కూల్ వద్ద రోడ్ షో నిర్వహించారు. 26,27 డివిజన్లలో రోడ్‌షో కొనసాగింది. అబ్దుల్ కలాం విగ్రహాం మీదుగా 21వ డివిజన్ మీదుగా హనుమాన్ టెంపుల్ మారుతినగర్‌లో కొనసాగిన రోడ్‌షో ఆ తర్వాత సాయంత్రం 5గంటలకు మహర్షి డిగ్రీ కళాశాల, రెయిన్ బో స్కూల్, గాంధీనగర్‌లోని టీడీపీ కార్యాలయం వెనుకాల రోడ్‌షోలు చేపట్టారు.

టీఆర్‌ఎస్‌లోకి బీరువా, మేస్త్రీ, పెయింటర్లు
టీఆర్‌ఎస్ పార్టీ విధానాలపై ఆకర్షితులైన 72 మంది ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమారపు సత్యనారాయణ సమక్షంలో సోమవారం చేరారు. గోదావరిఖనిలో బీరువా, మేస్త్రీ అండ్ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో వారికి సోమారపు సత్యనారాయణ తన నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, గతంలో గౌరవ అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటి చందర్ విధానాలు నచ్చకపోవడంతో ఆయన స్థానంలో కొద్ది రోజుల క్రితమే గౌరవ అధ్యక్షుడిగా సోమారపు అరుణ్‌కుమార్‌ను ఎన్నుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం రామగుండం అభివృద్ధి కోసం పరితపిస్తున్న సో మారపును ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకో వాలనే లక్ష్యంతో తాము చేరినట్లు ఆ అసోసి యేషన్ అధ్యక్షులు దాసరి ఊషాలు, దేవరనేని కమలాకర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పిడుగు క్రిష్ణ, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సోమారపు అరుణ్‌కుమార్ ఉన్నారు.

ఉపాధ్యక్షుడిగా సర్వర్ పాషా
గోదావరిఖనిలోని హనుమన్‌నగర్‌కు చెందిన మహ్మద్ సర్వర్‌పాషాను టీఆర్‌ఎస్ పార్టీ హనుమాన్‌నగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా నియమిం చినట్లు సోమారపు సత్యనారాయణ తెలిపారు. హనుమాన్‌నగర్ పట్టణ కమిటీలో ఉపాధ్యక్షుడిగా నియమించిన సర్వర్ పాషాకు నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని సోమారపు కోరారు. ఈ కార్యక్రమంలోఎండీ అక్రం పాల్గొన్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...