గెలుపే లక్ష్యంగా పని చేయాలి


Mon,November 19, 2018 02:55 AM

-టీఆర్‌ఎస్‌లోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం
-దాసరి నామినేషన్‌కు తరలుదాం
-జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్
జూలపల్లి : ప్రతి కార్యకర్త టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సోమవారం పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ మనోహర్‌రెడ్డిపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచి మరోసారి సీటు కేటాయించారనీ, రెండోసారి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఇక్కడ గ్రామ కమిటీల అధ్యక్షుడు నల్లతీగల సతీశ్, చొప్పరి శేఖర్, గడ్డమీద శ్రీనివాస్, కన్నం రమేశ్, లక్కాకుల శ్రీనివాస్, దుగ్యాల వెంకట్రావ్, తొంటి రాజేశం, గండు మల్లారెడ్డి, నాయకులు సూరిశెట్టి రాజేశం, పల్లె రాములు, రేశవేని శ్రీనివాస్, పాలకుర్తి అంజయ్య, మల్లెత్తుల కన్కయ్య తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ : టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి మనోహర్‌రెడ్డి సోమవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా ప్రచార ర్యాలీకి మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరావాలని మండల శాఖ అధ్యక్షుడు కొట్టె రవీందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు తులా మనోహర్‌రావులు పిలుపునిచ్చారు. శాంతినగర్ నుంచి నిర్వహించే బైక్ ర్యాలీలో దాసరికి మద్దతుగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎలిగేడు : దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లిలో నామినేషన్ వేస్తున్నారనీ, దీనికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తానిపర్తి మోహన్‌రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంతో పాటు గ్రామాలాభివృద్ధికి అహర్నిశలు పాటుపడిందని చెప్పారు. దాసరి మనోహర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని మోహన్‌రావు కోరారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...