సంక్షేమ పథకాలతోనే ఆదరణ


Sat,November 17, 2018 01:53 AM

-ధర్మపురి అభ్యర్థి కొప్పుల
-పలుగ్రామాల్లో ప్రచారం
-ఈశ్వర్ సమక్షంలో చేరికలు
ధర్మారం: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమను ఆదరిస్తున్నారని టీఆర్‌ఎస్ ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సింగాపూర్, సాయంపేట, గోపాల్‌రావుపేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలు, పార్టీ నాయకులు కొప్పులకు ఒగ్గుడోలు, కోలాట కళాకారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకుడు పంబాల మధూకర్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు, మహిళలు ఈశ్వర్ సమక్షంలో వేర్వురుగా చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. రైతుల కోసం కోటి ఎకరాలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ ఫలితాలు త్వరలోనే అందనున్నాయని, ఇక రైతులకు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని అన్నారు. మహాకూటమి పేరుతో వస్తున్న నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ నాయకులు టీడీపీతో ఎందుకు జతకట్టారో ప్రశ్నించాలని ఈశ్వర్ అన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు పూస్కూరు జితేందర్‌రావు, పాకాల రాజయ్య, మండల కోఆర్డినేటర్ పెంచాల రాజేశం, సభ్యుడు పాక వెంకటేశం, నర్సింగాపూర్, నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, గోపాల్‌రావుపేట గ్రామాల ఎంపీటీసీలు నోముల పుష్పలత, చింతల ధనుజ, మాజీ సర్పంచులు బంగుటపు భాగ్యలక్ష్మి, కనుకుట్ల సుజాత, ఆయా గ్రామాల అధ్యక్షులు సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, బొలిశెట్టి చుక్కయ్య, మేకల రాజయ్య, కొత్తూరు ఎంపీటీసీ తాళ్లపల్లి లింగయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు మిట్ట తిరుపతి, ఎండీ రఫీ, టీఆర్‌ఎస్‌వై, బీసీ, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు రాచూరి శ్రీధర్, మేడవేని పెద్దన్న, మద్దునాల వెంకటేశ్, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ అజాం బాబా, నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, నున్సావత్ భాస్కర్‌నాయక్, బంగుటపు కొమురయ్య, గుండా సత్యనారాయణరెడ్డి, బద్దం లింగారెడ్డి, గొడుగు మల్లయ్య, నల్లా శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ మహిపాల్, చల్ల కొమురయ్య, కనకం అంజయ్య, సందినేని కొమురయ్య, దేవి జనార్దన్, మూల మల్లేశం, వెంకటరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...