అభివృద్ధి చూసి ఓటెయ్యండి


Sat,November 17, 2018 01:52 AM

జ్యోతినగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యాలని టీఆర్‌ఎస్ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీలోని ఐదో డివిజన్ వాసులు భారీగా టీఆర్‌ఎస్ చేరనున్న సందర్భంగా పట్టణంలోని దేవి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదో డివిజన్‌కు చెందిన 75మంది బీజేపీ కార్యకర్తలు, డివిజన్‌లోని న్యూపోరట్‌పల్లి, జంగాలపల్లికి చెందిన దాదాపు 500మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి సోమారపు సత్యనారాయణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదికపై టీఆర్‌ఎస్‌లో చేరిన డివిజన్ వాసులు సోమారపు సత్యనారాయణ గెలుపు ధ్యేయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడారు. నిజాయతీకి మారుపేరుగా, రామగుండం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనను మరోసారి ఆశ్వీరదించాలన్నారు. టీఆర్‌ఎస్ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన డివిజన్ వాసులకు అండగా నిలబడతాన్నారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ జాలి రాజమణి, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, నాయకులు నీరటి శ్రీనివాస్, చెప్యాల రామారావు, మెట్టుపల్లి అనిల్‌రావు, పిట్ట సమ్మయ్య, భరత్‌గౌడ్, సత్యప్రకాశ్, ఊడం మల్లేశం, నర్సింహారెడ్డి, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ధర్మోజి లక్ష్మణ్, గోసిక శ్రీనివాస్, మేకల నారాయణ, బడుగు శ్రీనివాస్, బోగి నారాయణతో పాటు మహిళలు ఉన్నారు.

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని టీఆర్‌ఎస్ రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ సూచించారు. శుక్రవారం సాయంత్రం గౌతమినగర్‌లోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచేలా నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్, మురళీధర్‌రావు, రాజమౌళి, లింగమూర్తి, దీటి వెంకటస్వామి, నీరటి శ్రీనివాస్, కుల్ల వెంకటేశ్వర్లు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని గంగానగర్‌లోని స్వరూప గార్డెన్స్‌లో పూసల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పుసల సంఘం వారు చాలా వెనుకబడిన వారిగా ఉన్నారని, వారి కార్యాలయానికి అవసరమైన నిధులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇస్తానని, రుణాలు మంజూరు చేయించడం, డబుల్ బెడ్ రూంలలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం మేయర్ జాలి రాజమణి, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ వడ్లూరి రవి, పూసల సంఘం అధ్యక్షుడు గుండ్ల వెంకటయ్య, కుమ్మరి మల్లేశ్, తన్నీరు రాకేశ్, సతీశ్, మహిళా అధ్యక్షురాలు కావేటి విజయలక్ష్మి పాల్గొన్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...