అటవీ గ్రామాల్లో వెలుగులు నింపాం


Sat,November 17, 2018 01:52 AM

పలిమెల: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అటవీ గ్రామాల ప్రజల్లో వెలుగులు నింపామని టీఆర్‌ఎస్ మంథని అభ్యర్థి పుట్ట మధు అన్నారు. శుక్రవారం పలిమెల మండలంలోని అటవీ గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అటవీ గ్రామాల్లోని ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించి వారి కళ్లల్లో ఆనందం చూసామని పేర్కొన్నారు. పలిమెల మండలంలోని పలుగ్రామాల ప్రజలకు గతంలో బస్సు అంటే ఎరుగని గ్రామాలు ఉండేవనీ, టీఆర్‌ఎస్ పాలనలో అన్ని ప్రాంతాల్లో వంతెన నిర్మాణాలకు పూనుకుని రవాణా సౌకర్యం మెరుగుపరిచామని వెల్లడించారు.

తలాపునే గోదావరి ప్రవహిస్తున్నా గుక్కెడు నీటి కోసం ప్రజలు ఎదురుచూసే దుస్థితి ఉండేదని, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన గోదావరి నీటిని అందిస్తున్నామన్నారు. తనను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే అటవీ గ్రామాల్లో మిగిలిన పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మండలలోని ముకునూరు, బూర్గుగూడెం గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ భూపతి లక్షి, మాజీ ఉపసర్పంచ్ మట్టి మల్లన్నల ఆధ్వర్యంలో దమ్మూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్ది ముత్తేష్‌తో పాటు100 మంది ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో పుట్ట మధు సమక్షంలో చేరారు. ప్రచారంలో పలువురు నాయకులు న్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...