ఐదో రోజు పది


Sat,November 17, 2018 01:52 AM

మంథని నమస్తే తెలంగాణ/ కలెక్టరేట్ / జ్యోతినగర్ : శాసన సభ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో జిల్లాలో ఐదో రోజు శుక్రవారం పది మంది నామినేషన్లు వేశారు. పెద్దపల్లి శాసనసభ స్థానానికి బీఎల్‌ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుంటిపల్లి సమ్మయ్య, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటికొండ చారి, సమాజ్‌వాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారం తిరుపతి యాదవ్, ఇండియా ప్రజాబంధు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల అశోక్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా వసరాల నతానైల్ తమ అనుచరులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐదు రోజుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 12 నామినేషన్లు దాఖలయల్యాయి. అలాగే, మంథని నియోజకవర్గంలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన నూనె రాజేశం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు తరపున మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజీంఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. బొమ్మ బాపు స్వతంత్ర అభ్యర్థిగా మరో సెట్టు నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు వారు మంథని అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెంచు నగేశ్‌కు అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. రామగుండం నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థులుగా బుర్ర తిరుపతి, వేల్పుల కుమారస్వామి వేర్వేరుగా తమ నామినేషన్లు దాఖలు చేయగా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కామిని సరోజన, స్వతంత్ర అభ్యర్థి ఇరికిల్ల రాజేశ్‌లు తమ నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహామూర్తికి అందజేశారు. దీంతో ఇప్పటి వరకు రామగుండంలో నామినేషన్‌ల తొమ్మిదికి చేరింది.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...