పల్లెపల్లెనా ప్రచార హోరు


Sat,November 17, 2018 01:52 AM

పెద్దపల్లి ప్రతినిధి, గోదావరిఖని నమస్తేతెలంగాణ, జ్యోతినగర్, ధర్మారం, మంథనిరూరల్: జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర ఆర్థిఖ శాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్‌తోపాటు ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, పలువురు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

అలాగే పూసల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పిన సోమారపు పార్టీలోకి ఆహ్వనించారు. మంథని అభ్యర్థి పుట్ట మధు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, పలిమెల మండలాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా పుట్ట మధుకు మద్దతుగా పుట్ట శైలజ మంథని మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అలాగే ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, సాయంపేట, గోపాల్‌రావుపేట గ్రామాల్లో ఈశ్వర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల్లోనూ టీఆర్‌ఎస్ నాయకులు ఓట్లు అభ్యర్థించారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...