ఎన్టీపీసీలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్


Fri,November 16, 2018 01:03 AM

జ్యోతినగర్: పర్యావరణ పరిరక్షణకు ఎన్టీపీసీ ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో నడిచే వాహనాల కోసం టౌన్‌షిప్‌లోని మెయిన్ గేట్ ఏరియాలో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేసిన ఆపరేషన్ డైరెక్టర్ ప్రకాశ్ తివారి ఆ స్టేషన్‌ను గురువారం ప్రారంభించారు. అలాగే ఎన్టీపీసీకి వచ్చే విజిటర్స్‌కు ప్లాంటు, టౌన్‌షిప్‌లో ప్రయాణించేందుకు ఎన్టీపీసీ కొత్తగా అద్దెకు తీసుకున్న ఈ వెహికల్(ఎలక్ట్రికల్ గోల్ఫ్ కార్ట్ వాహనం)ను కూడా డైరెక్టర్ ప్రారంభించి దానిలో కాసేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, మార్కెట్‌లో ఇప్పటికే బ్యాటరీ చార్జింగ్ వాహనాల వినియోగం ఉందని తెలిపా రు. రానున్న రోజుల్లో మరింత పెరుగనుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దిలీప్‌కుమార్ దూబే, ఇక్కడి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రవీంద్ర, జీఎంలు ఏకె జైన్, పీకే లాడ్, విజయ్‌సింగ్, రామారావు, ఈ వెహికిల్ ఎన్టీపీసీ కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి తదితరులున్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...