దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే..


Thu,November 15, 2018 12:20 AM

ఫెర్టిలైజర్‌సిటీ: దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఇండో అమెరికన్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ పేర్కొన్నారు. ఎల్‌బీ నగర్‌లోని ఐఏఎస్ పాఠశాలలో బుధవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా వేషధారణలతో అలరించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగాయి. అలా గే స్థానిక హనుమాన్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఇక్కడ ఉపాధ్యాయుడు మేజిక్ రాజా ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ, మేజిక్ హరి ప్రదర్శించిన ఇంద్రజాలం, నృత్యాలు అలరించాయి.

ఇక్కడ ఉపాధ్యాయులు బిల్ల సంపత్, చంద్రపాల్ ఉన్నారు. రామగుండంరూరల్: రామగుండంలోని తబి తా ఆశ్రమంలో బాలల దినోత్సవాన్ని చేపట్టారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఎన్. అశోక్‌కుమార్ హాజరయ్యారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు బేనిగోపాల్‌త్రివేది దంపతులు పిల్లల మధ్య కేక్‌కట్‌చేశారు. ఆశ్రమం అభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషిచేస్తానని అశోక్‌కుమార్ హామీ ఇచ్చారు. అలాగే 1,2,49,50 డివిజన్లలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేడుకలు చేపట్టారు.

పాలకుర్తి: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని చేపట్టారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడంతోపాటు, కేక్‌కట్‌చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. జవహర్‌లాల్‌నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమలు అలరించాయి.

ఫెర్టిలైజర్‌సిటీ: జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను బుధవారం జవహర్ నగర్‌లోని చాచా నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేసుకున్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఇక్కడ బడికెల రాజలింగం, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, ఎంఎస్ రాజ్‌ఠాకూర్, బొంతల రాజేశ్, తానిపర్తి గోపాల్‌రావు, తిప్పారపు శ్రీనివాస్, ముస్తపా, ఎంచర్ల మహేశ్, పీచర శ్రీనివాస్ తదితరులున్నారు.

అంతర్గాం: సోమనపల్లి, ముర్మూరు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలు తీసి, పిల్లలకు ఆటల, వ్యాసరచన పోటీలు చేపట్టారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు పెండ్యా ల విమల, శశికళతోపాటు కవితారాణి, భారతి, కమిటీ సభ్యులు ఎం.కీర్తన, లావణ్య, సౌమ్య, లక్ష్మి, ఆశ వర్కర్లు జ్యోతి, శిరీష, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

జ్యోతినగర్: విశ్వభారతి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భం గా విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధనలు, స్వయం పరిపాలనతో ఉపన్యాసాస, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన విద్యార్థులు జె అనిత్‌బాబు, ఎస్ సుభాష్‌కు బడి చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ ప్రత్యేక బహుమతులను అందజేశారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...