దాసరిని గెలిపించండి


Wed,November 14, 2018 01:42 AM

-దాసరి పుష్పలతారెడ్డి
-పెద్దపల్లిలో ఇంటింటా ప్రచారం
కలెక్టరేట్: అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని దాసరి మనోహర్‌రెడ్డి సతీమణి పుష్పలతారెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో గల 7వ వార్డులో మంగళవారం సాయంత్రం ఆమె స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రగతి నివేదన కరపత్రాలను అందజేశారు. అనంతరం పుష్పలతారెడ్డి మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలంటే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ గెలిస్తేనే గతంలో ప్రవేశపెట్టిన పథకాలన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగి వాటి ఫలాలు అర్హులైన వారికి అందుతాయని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సందనవేని సునీతయాదవ్, కౌన్సిలర్లు ఉప్పు రాజ్‌కుమార్, తబ్రేజ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎరుకల రమేశ్, నాయకులు నాంసాని సరేశ్, బొంగోని అనిల్, చొప్పరి అన్వేష్, ముత్తునూరి స్వామి, నీతారెడ్డి, లావణ్యరెడ్డి, రొట్టె శారద, త్రివేణి, స్వప్న, ఫహిమా, రజని, నిర్మల, సమత, రుబినా, షఫీయోద్ధీన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...