కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటా


Wed,November 14, 2018 01:42 AM

-ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
-టీవీ ఆపరేటర్లతో సమావేశం
-పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ
గోదావరిఖని,నమస్తేతెలంగాణ: రామగుండంలో పెద్ద సంఖ్యలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లకు అండగా ఉంటానని, టీవీ కేబుల్ ఆపరేటర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించడానికి తాను వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్, రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి గౌతమినగర్‌లోని తన నివాసంలో పెద్ద సంఖ్యలో హాజరైన కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల వారిని ఆదుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారనీ, ప్రభుత్వ పరంగా కేబుల్ టీవీ ఆపరేటర్లకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆర్టీసీ చైర్మన్‌కు తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.

కేబుల్ టీవీ ఆపరేటర్లకు అవసరమైన సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాలని, హెల్త్‌కార్డులు, గ్రూపు ఇన్సూరెన్స్‌లు, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీగా కేబుల్ టీవీని గుర్తించాలని, కేబుల్ టీవీ ఆపరేటర్లకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. వీటిపై స్పందించిన సోమారపు సత్యనారాయణ తన హాయంలో చాలా సంఘాలకు సమావేశ మందిరాలకోసం నిధులు కేటాయించానని, కేబుల్ ఆపరేటర్లకు తాను గెలిచిన వెంటనే నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మంథని సంపత్, రామగుండం అధ్యక్షుడు తాటి కొమురయ్య, కార్యదర్శి సాదు రమేశ్, మోసం చందర్‌రావు, రాకం వేణు, దాతు శ్రీను, మీసాల సతీశ్, జీ.డీ కుమార్, అంజయ్య, కిషన్‌రెడ్డి, తూండ్ల శ్రీను, రమేశ్, నందు, కిషన్, కదిర్, శ్రావణ్, శంకర్, బాబు, మల్లేశ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...