కారును గెలిపించుకునేందుకే చేరికలు


Wed,November 14, 2018 01:41 AM

-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
-కాంగ్రెస్ నుంచి పలువురి చేరిక
కలెక్టరేట్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తున్న వారంతా కారును మళ్లీ గెలిపించుకుని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్ వైపు కదులుతున్నారని టీఆర్‌ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పెద్దపల్లి మండలం తుర్కలమద్ధికుంట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి దాసరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్దపల్లి మండల కో-ఆప్షన్ సభ్యుడు హబీబ్ ఉర్ రెహమాన్, నాయకులు ఈదునూరి వెంకటి, చాంద్‌పాషా, యూసుఫ్ అన్సార్, సంపత్, శ్యామ్, స్వామి, వెంకటేశ్, వినోద్, సంజీవ్, రాజేశ్, హరిప్రసాద్, ఎండీ అమీర్, ఎండీ ఇస్మాయిల్, ఎస్‌డీ మోయిజ్, వినోద్, లలిత్, రెహమాన్, సతీశ్, మహేశ్, సాయికిరణ్, శివ, శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, సాగర్, రవికుమార్, రాజ్‌కుమార్, రాజు పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...