మోగిన రణభేరి


Tue,November 13, 2018 01:34 AM

-అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
-నామినేషన్ల ప్రక్రియ షురూ
-తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎనిమిది..
( పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఉదయం 10.30గంటలకు రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో గెజిట్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కేం ద్రాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 19వరకు ప్రతి రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 7న ఉదయం ఏడు గంటల నుంచి సాయం త్రం 5గంటల పోలింగ్ ఉండనున్ననది. ఉమ్మడి జిల్లాలో ఒక్క మంథనిలో మాత్రం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే పో లింగ్ జరగనున్నది. 11న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులు అన్ని నియోజవకవర్గాల కేంద్రాల్లో పకడ్బం దీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబ స్తు ఉంచారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపి వేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. అక్కడి నుంచి వంద మీటర్ల దూ రం వరకు మూడు వాహనాలను మాత్రమే అనుమతించారు. వంద మీటర్ల దూరం నుంచి అభ్యర్థులు నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. గుర్తింపు పొంది న పార్టీ అయితే అభ్యర్థిసహా ఐదుగురు, స్వంతం త్ర అభ్యర్థులైతే అభ్యర్థితోసహా 11 మందిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.

మొదటి రోజు ఎనిమిది నామినేషన్లు..
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణం నుంచే స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు సోమవారం 13 నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా నామినేషన్లు తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఐ దు, పెద్దపల్లిలో రెండు, కరీంనగర్ జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది దాఖలైనట్లు ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం బోణీ కొట్టలేదని చెప్పారు.

పెద్దపల్లిలో రెండు..
మంథని, నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్: తపెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నామినేషన్లు వేశారు. మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు తరపున ఆయన సతీమణి శైలజ ఉదయం 11. 48 గంటలకు ఒక సెట్ నామినేషన్ పత్రాలను మంథనిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం నగేశ్‌కు అందజేశారు. నామినేషన్‌ను మంథనికి చెం దిన ప్రముఖ న్యాయవాది అవధానుల రమేశ్ బా బు ప్రతిపాదించారు. ఆమె వెంట పుట్ట మధు సన్నిహితులు భైర్నేని సందీప్‌రావు, మద్దిపాటి శ్రీనివాసరావు, అయిలి విజయభాస్కర్, బోనాల శ్రీనివాస్, కొమ్ము నర్సయ్యలు రాగా, నలుగురిని అధికారులు లోపలికి అనుమతించారు. ఇక రామగుండం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బ ల్మూరి వనిత నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసి న ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో మధ్యా హ్నం తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహామూర్తికి అందజేశారు.

జగిత్యాలలో ఐదు..
ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నలుగురు నాయకులతో కలిసి, రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలను, రిటర్నింగ్ అధికారి భిక్షపతికి అందజేశారు. కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కుటుంబ సభ్యులతో ఉదయం మెట్‌పల్లిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని, రిటర్నింగ్ అధికారి గౌతమ్ పొట్రుకు నామినేషన్ పత్రాలను తన మనుమరాలు శాసతో కలిసి అందించారు. ఆయన తరపున సతీమణి సరోజ సైతం ఒకసెట్ నామినేషన్‌ను వేశారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల వద్ద నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. పిరమిడ్ పార్టీ తరపున జగిత్యాలకు చెందిన ప్రముఖ వైద్యుడు వడ్లమాని సత్యనారాయణ మూర్తి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.

కరీంనగర్ జిల్లాలో ఒకటి..
కరీంనగర్ నియోజకవర్గం నుంచి బహుజన్ లెప్ట్ పార్టీ తరుపున వసీమొద్దీన్ అహ్మద్ నామినేషన్ వేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ నామినేషన్లు సమర్పించలేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

మంథనిలో
4గంటల వరకే పోలింగ్..
ఎన్నికల సంఘం సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని గంట తగ్గించింది. పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తుండగా, మంథనిలో మాత్రం సాయంత్రం 4గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మంథని నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో 275 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందులో 60 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా, 51 సమస్యాత్మకమైనవిగా ఉండడంతో ఓటింగ్ సమయాన్ని గంటపాటు కుదించింది.

జిల్లాకు వ్యయ పరిశీలకులు
జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఎం దాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ని యమించగా, సోమవారం సాయంత్రం పెద్దపల్లికి చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీ దేవసేన, జేసీ వనజాదేవితో అధికారులతో సమీక్షించారు. 15వ తేదీవరకు ఆయన జిల్లాలోనే ఉం డి ఎన్నికల వ్యయంపై ఏర్పాట్లను పరిశీలిస్తారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...