కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేద్దాం


Tue,November 13, 2018 01:32 AM

మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందామని టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. సోమవారం మంథని మండలం కన్నాలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు, బీఫామ్‌తో సతీసమేతంగా ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంథని ప్రజలు తనకు మరోమారు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. మరోమారు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలి చి మంథని నియోజకవర్గ ముఖచిత్రాన్నే మార్చేస్తానన్నారు. 60ఏళ్ల పరాయి పాలనకి, గత నాలుగు సంవత్సరాల మూడు నెలల టీఆర్‌ఎస్ పాలనలో నక్కకూ నాగలోకానికి ఉన్న వ్యత్యాసం ఏమిటో ప్రజలకు చూపించామని తెలియజెప్పా రు. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో, సంతోశంతో నమ్మకంతో ప్రజల మధ్యకు వెళుతు న్న తనను గ్రామగ్రామాన ప్రజలు అత్యంత ప్రేమగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీ లు, ఎస్టీలు, మైనార్టీలందరితోపాటుగా అన్ని సామాజికవర్గాలు తనకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయని వివరించారు. కేసీఆర్ పాలన తర్వాత ప్రజల వద్దకు వెళుతున్న తమకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. వేంకటేశ్వర స్వామిని గత ఎన్నికల సమయంలో సైతం తాను దర్శించుకొని నామినేషన్ దాఖలు చేశానని, అదే ఆనవాయితీని కొనసాగిస్తూ స్వామి వారిని దర్శించుకున్నానన్నారు.

తప్పకుండా స్వామి అనుగ్రహంతో మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆలయానికి వస్తానని ధీ మా వ్యక్తం చేశారు. కాగా మంథని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధు కన్నాల గ్రామంలో పర్యటించగా అడుగడుగున జనం నీరాజనాలు పలికారు. జై తెలంగాణ..జైజై కేసీఆర్..జైజై పుట్ట మధు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోకి వచ్చిన పుట్ట మధుకు గ్రామస్తులు డప్పుచప్పుళ్ల మధ్య బాణసంచా కాలుస్తూ ర్యాలీగా ఆలయం వరకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, మంథని ఎంపీపీ ఏగోళపు కమల, సింగిల్ విండో చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, టీఆర్‌ఎస్ మంథని మండల అధ్యక్షుడు కొండా శంకర్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, నారమల్ల లక్ష్మీరాజం, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, టీఆర్‌ఎస్ మంథని పట్టణ అధ్యక్షుడు ఆరెపల్లి కుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పర్వతాలు యాదవ్, ఎంపీటీసీ పొయిల శారద, బం డారి సమ్మయ్య, ఎస్‌కే యాకూబ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గుడిసె గట్టయ్య, ఆలయ చైర్మన్ గుండ్రెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు కనవేన శ్రీనివాస్, జాగిరి సదానందం, మాజీ సర్పంచ్ మాచీడి రమేశ్, కాసిపేట వెంకటేష్, ఆవునూరి లింగయ్య, చిన్నపిక్కల రాజయ్య, బొమ్మగాని కనుకయ్యగౌడ్, బెల్లంకొండ దయాకర్‌రెడ్డి, బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, కండె రమేశ్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...