అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యండి


Tue,November 13, 2018 01:32 AM

రామగుండం రూరల్: అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రజలను కోరారు. పాలకుర్తి మండలం గుడిపెల్లి గ్రామంలో సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సోమారపు సత్యనారాయణకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ పంచాయతీల్లో గుడిపెల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశామని తెలిపారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రతిపనిపై దూరదృష్టితో ఆలోచించి నియోజక వర్గంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగానే ఉమ్మడి రామగుండం మండలంలోని 25వేల ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందదని గ్రహించి ఎల్లంపల్లి నుంచి రెండు లిఫ్టుల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించాననీ, ఇందుకోసం రూ.95 కోట్ల నిధులు మంజూరు చేశానని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలో టీడీపీ, కాంగ్రెస్ చేయలేని పనులు నాలుగేండ్లలో చేసిందని గుర్తు చేశారు. సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందిని పేర్కొన్నారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గుడిపెల్లిని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు ఈద శంకర్‌రెడ్డి, ఆడెపు రాజేశం, చిట్టబోయిన రాజ్‌కుమార్, మామిడాల ప్రభాకర్, మాదాసు రాజేశం, కొప్పు రాజేశం, శ్రీరాముల మొగిలి, పత్తి సంజీవ్, లక్ష్మణ్, మేకల నర్సయ్య, కొండ నారాయణ, పొన్నం సత్తన్న, కొలిపాక సత్యనారాయణ, నరేశ్, మహేశ్, శ్రీనివాస్, రమేశ్, దుర్గం మహేశ్, ఆశాలు, మేకల రమేశ్, నరేశ్, ఎర్రం మధునయ్య, మామిడాల శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...