బాక్సింగ్ చాంపియన్స్ హైదరాబాద్


Mon,November 12, 2018 02:24 AM

-కొనసాగుతున్న అండర్-19 బాక్సింగ్ పోటీలు
-విజేతలకు బహుమతుల అందజేత
సుల్తానాబాద్ : పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో జరగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బాలబాలికల విభాగాల్లో హైదరాబాద్ జట్లు క్లీన్‌స్వీప్ చేసి చాంపియన్స్‌గా నిలిచారు. ప్రతి కేటగిరీలో తమకు ఎదురులేకుండా అత్యున్నతమైన ప్రతిభను కనబరిచి బహుమతులను కైవసం చేసుకున్నారు. అండర్-14 బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, ఆదిలాబాద్ జట్టు ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకుంది. అండర్-17 బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు చాంపియన్స్‌గా నిలువగా, వరంగల్, రంగారెడ్డి జిల్లాలు సమాన పాయింట్లు సాధించి ద్వితీయస్థానంతో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. అండర్ -19 విభాగంలో పోటీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో ప్రతిభావంతులుగా నిలిచిన క్రీడాకారులకు స్థానిక ఎస్‌ఐ రాజేశ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయనీ, క్రీడలను జీవితంలో ఒక భాగంగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం పలువురిని నిర్వాహకులు సన్మానించారు. ఇక్కడ మాజీ అంతర్జాతీయ బాక్సింగ్ కోచ్ చిరంజీవి, మొదటి బంగారు పతక గ్రహీత చోటెమియా, రైల్వే కోచ్ దుర్గా ప్రసాద్, బాక్సర్ బలరామ్, ఆనందభాస్కర్, అబ్జర్వర్ పార్థసారథి, నర్సింహరాములు, వీరస్వామి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి అంతటి శంకరయ్య, పెటా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, దూడం రమేశ్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, మాటేటి గట్టయ్య, సంజీవ్, గెల్లు మధూకర్, బాలసాని రాజ్‌కుమార్, మహ్మద్ షఫీ, రేణుక, శోభారాణి, శివ, సంతోష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...