టీఆర్‌ఎస్ శ్రేణుల ఇంటింటా ప్రచారం..


Mon,November 12, 2018 02:23 AM

సుల్తానాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేండ్లలో నియోజకవర్గంతో పాటు సుల్తానాబాద్‌లో ఘననీయమైన అభివృద్ధి సాధించామనీ.. అందుకే మళ్లీ ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉన్నదనీ, ఆ అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని సుల్తానాబాద్ ఎంపీపీ పారుపెల్లి రాజేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లోని గడిమహల్, రజకనగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ రాష్ట్రంలో 456 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేద ప్రజల మనస్సును దోచుకున్నారనీ, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫేస్టోలో ప్రకారం అభివృద్ధిని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముందస్తు రావడంతో మండలంలో రూ. 11 కోట్ల అభివృద్ధి పనులు పెండింగ్‌లో పడ్డాయనీ ఎన్నికల తర్వాత రూ. 11 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాసరికి మద్దతుగా నిలువాలనీ, కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ప్రచారంలో సీనియర్ నాయకులు గాజుల రాజమల్లు, సూరశ్యాం, తిప్పారపు దయాకర్, పారుపెల్లి గుణపతి, గందె మల్లకార్జున్, తోట వెంకటేష్, దేశెట్టి మహేందర్, ఎండీ రఫిక్, పూసాల రామకృష్ణ, కోట వెంకటేశ్, బొల్లి నగేశ్, ఒజ్జ సంజీవ్, అరెల్లి చంద్రయ్యగౌడ్, బైరగోని ప్రభాకర్, పోసాని శ్రీనివాస్, కోట సురేందర్ తదితరులున్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...