సమాజాన్ని లేపేది కవిత్వం


Mon,November 12, 2018 02:23 AM

-డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్‌రాజు
-కవి చెమన్‌కు ఘన సన్మానం..
-గ్రామస్తుల ఆత్మీయ సత్కారం
జూలపల్లి : కవిత్వం సమాజాన్ని తట్టి లేపి చైతన్యవంతం చేస్తుందని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఇటీవల కుమ్మరికుంట గ్రామానికి చెందిన జాతీయస్థాయి కవి, రచయిత, సామాజిక కార్యకర్త, పురావస్తు పరిశోధకుడు చెమన్‌సింగ్‌కు జర్మనీ పీస్ యూనివర్శిటీ డాక్టరేట్ బిరుదు ఇచ్చి సత్కరించింది. చెమన్‌సింగ్ అల్లోపతి వైద్యానికి ప్రత్యామ్నాయంగా పలు వైద్య పరిశోధనలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కుమ్మరికుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం గ్రామస్తులు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతరం కవిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాహిత్య రంగంలో కొత్త ఒరవడికి నాంది పలకాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకున్న వ్యక్తి ఉన్నతంగా తీర్చిదిద్ధబడతాడని తెలిపారు. చెమన్ కడు పేదరికంలో పూరి గుడిసెలో పుట్టి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విశారపు శ్యామల, జూలపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ కామ రాజు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ విశారపు వెంకటేశం, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, కవి రంగు తిరుపతి, మాజీ ఎంపీటీసీ ఆవుల రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు గడ్డం అనంతరెడ్డి, ఎల్లాల మల్లారెడ్డి, రాజమల్లయ్య, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కొమ్మ మల్లేశం, ఎల్లాల ప్రతాప్‌రెడ్డి, ఏడీఏ మేచినేని ఆంజనేయరావు, ఏఈ ముల్కల చారి, నాయకులు కుంట రాజేశ్వర్‌రెడ్డి, దేవనపెల్లి లక్ష్మణ్, దొంత తేజ, కాట రవీందర్, మాదాసు రవి, కందుల లచ్చయ్య, కొల్లూరి ఆనందం, బీమరాజు తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...