ముమ్మర తనిఖీలు


Fri,November 9, 2018 03:24 AM

కలెక్టరేట్ : ఎన్నికల నేపధ్యంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు జరిగేలా చూడాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలతో రంగంలోకి దిగిన వారు పెద్దపల్లిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు అక్రమార్గాలో తరలించే డబ్బు, మద్యం ఇతరత్రా రవాణాపై ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్ పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. వారం రోజులుగా సివిల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎక్సైజ్ పోలీసులు సైతం ఎన్నికల కోసం మద్యం, బెల్లం, గుడుంబాలను తరలిస్తున్నారనే అనుమానంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి బెల్లంతో పాటు మద్యం రవాణా అవుతుందనే ఆరోపణల నేపధ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో రైలు బోగిలను, పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ శివారులో గల రైల్వేైప్లె ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మకాం వేసిన పోలీసులు రాజీవ్ రహదారిపై వెళ్తున్న వాహనాలన్నింటిని ఆపుతూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగాలన్న ఉద్ధేశంతో కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల వేళ అక్రమంగా మద్యం కానీ, గుడుంబా కానీ, నల్లబెల్లం లాంటివి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సీఐ వెంట ఎస్‌ఐ మనీషా రాథోడ్, పోలీసు సిబ్బంది వనిత, అఫ్జల్ పాషా, శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉన్నారు.

140
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...