విజయం మనదే..


Thu,September 13, 2018 01:17 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే మధు
-టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు
-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట
మంథని, నమస్తే తెలంగాణ: మంథని నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులకు తోడు పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంథనిలోని తన నివాసం వద్ద మహదేవపూర్ మండలం అన్నారం గ్రామ అధ్యక్షుడు అరిగెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పుట్ట మధు పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయన్నారు. తమపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న కార్యకర్తల, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ సందర్భంగా అన్నారం గ్రామానికి చెందిన ఎన్నపురెడ్డి ముత్యంరెడ్డి, అనసూరి కిష్టయ్య, కొడిపె కొమురయ్య, జిమ్మిడ లక్ష్మీరాజు, బోగె మహేశ్, పంచిక రజనీకాంత్, గోమాస దేవరాజు, గోసుల మల్లయ్య, తోడేటి దేవేందర్, మాదరి రాజులతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. మంథని వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, టీఆర్‌ఎస్ నాయకుడు బిట్టు సురేశ్‌తోపాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాటారం మండలంలో..
కాటారం: మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఒడిపిలవంచ, మద్దులపల్లి గ్రామాల నుంచి కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పుట్ట మధు సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఒడిపిలవంచ మాజీ సర్పంచ్ దండ్రు మల్లయ్య, మాజీ వైస్ ఎంపీపీ బండారి మల్లక్క-గట్టయ్యలతో పాటు పలువురికి గులాబీ కండువాలు కప్పి పుట్ట మధు టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కిష్టంపేటలో డెంగీ జ్వరంతో మృతిచెందిన సుతారి మహేశ్, అనారోగ్యంతో మృతిచెందిన జంగిలి సంధ్యారాణి కుటుంబాలను పుట్ట మధు పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట పలువురు ఉన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...