ధర్మపురికి భారీ బైక్ ర్యాలీ..


Thu,September 13, 2018 01:16 AM

-కొప్పులకు మద్దతుగా బయల్దేరిన టీఆర్‌ఎస్ శ్రేణులు
ధర్మారం: ధర్మపురి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు బుధవా రం ధర్మారం మండలకేంద్రం నుంచి ధర్మపురి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముం దు ఈశ్వర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ శ్రీ రామాలయంలో పార్టీ నాయకు లు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నందిమేడారం సింగిల్ విండో చైర్మన్ పూస్కూరు నర్సింగారావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ పెంచాల రాజేశం, సభ్యుడు పాక వెంకటేశం, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు మిట్ట తిరుపతి, మూల మల్లేశం, ఉపాధ్యక్షుడు సాన రాజేందర్, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండీ ఆజాం, టీఆర్‌ఎస్‌వై, టీఆర్‌ఎస్‌వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు రాచూరి శ్రీధర్, బండి సురేశ్, మేడవేని పెద్దన్న, మద్దునాల వెంకటేశ్, బానోతు రాజేశంనాయక్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్లు కాడె సూర్యనారాయణ, కోమటిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గుండ సత్యనారాయణరెడ్డి, పూస్కూరు శరత్‌రావు, ధర్మారం పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు పాల్గొన్నారు.

ఖనిలో కొప్పుల ప్రత్యేక పూజలు
గోదావరిఖని,నమస్తే తెలంగాణ: తాజా మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బుధవారం గోదావరిఖని పట్టణంలోని శ్రీదుర్గాదేవి, అయ్యప్పస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు శ్రీదుర్గాదేవి ఆలయం లో కొప్పుల ఈశ్వర్, ఆయన సతీమణి స్నేహలత ప్రత్యేక పూజాలు చేయడం ఆనవాయితీ. పూజా కార్యక్రమాల్లో నాయకులు అచ్చె వేణు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఒజ్జ రాములు, భీమారపు కోటేశ్వర్‌రావు, దివాకర్, కరాటే మొండయ్య, మ్యాదరవేని రమేశ్, తోడేటి శంకర్‌గౌడ్, యాసర్ల తిమోతి, ఐలయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...