అన్ని వర్గాల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం


Thu,September 13, 2018 01:16 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100ప్లస్ సీట్లు ఖాయమని ప్రభుత్వ తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అనంతరం తొలిసారిగా బుధవారం ధర్మపురికి వచ్చిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి ధర్మపురి మండలం రాయప ట్నం వద్ద ఈశ్వర్‌కు ఘన స్వాగతం పలికారు. దా దాపు 2600 బైక్‌లతో రాయపట్నం నుంచి ధర్మపురి వరకు కోలాటాలు, డప్పుచప్పుళ్ల నడుమ భారీ ర్యాలీ నిర్వహించగా 63వ నంబర్ జాతీయరహదారి గులాబీ వర్ణంతో కనిపించింది. బైక్‌ర్యాలీతో ధర్మపురికి చేరుకున్న ఈశ్వర్ అంబేద్కర్ వి గ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మినరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈశ్వర్ మాట్లాడుతూ.. నియోజవర్గంలో తొమ్మిదిన్నరేళ్లుగా నరసింహస్వా మి దయ, కేసీఆర్ ఆశీర్వాదంతో ఇక్కడి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు.

మరోసారి అభ్యర్థిత్వం ఖరారైన మొదటిసారి ధర్మపురికి వ చ్చిన సందర్భంగా ఇంతభారీగా ప్రజలు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పార్టీ అడుగడునా అడ్డుపడుతున్నదని ధ్వజమెత్తా రు. దీంతో విసిగివేసారిన సీఎం కేసీఆర్ ప్రజల్లో తేల్చుకుందామని అసెంబ్లీని రద్దు చేశారన్నారు. జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతుకావడం, టీఆర్‌ఎస్ 100ప్లస్ సీట్లు గెలవడం ఖాయమన్నారు. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నియోజకవర్గాల అభివృద్ధ్దిపై దృష్టి సారించారనానరు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధ్దికి రూ.11 00 కోట్లు కేటాయించారన్నా రు. ధర్మపురి టెంపుల్‌సిటీ, మున్సిపాలిటీ అభివృద్దికి సీఎం కేసీఆర్ రూ.75కోట్లు కేటాయించారన్నారు. పారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.25వేల కోట్లు కేటాయించిందన్నారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రపంచదేశాలకే రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ విమర్శలకు గుణపాఠం చెప్పినట్లయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అనీ, రూ. వెయ్యి కోట్లతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నిండుకుండలా మార్చుతున్నామన్నారు.


పార్టీలో చేరికలు..
ధర్మపురి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసంధర్బం గా చీఫ్‌విప్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దేవస్థానంలో పూజలు
ధర్మపురి శ్రీలక్ష్మినరసింహస్వామివారి దేవస్థానంలో ప్రభుత్వ తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్చరణల మద్య అర్చకులు పూజలు నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి స్వామివారి శేషవస్ర్తాన్ని కప్పి, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గూ డూరి ప్రవీణ్, వెల్గటూర్ ఎంపీపీ పొ నుగోటి శ్రీనివాసరావ్, పీఏసీఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, దేవస్థా నం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్‌కుమార్, రైతు సమన్వయ సమతి మండల కన్వీనర్ సౌళ్ల భీమయ్య, సహకార సంఘం అద్యక్షుడు సౌళ్ల నరే శ్, ఎంపీటీసీ స్తంబంకాడి రమేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ మ్యాన శంకర్, నాయకులు సంగి శేఖర్, వొడ్నాల మల్లేశం, అనంతుల లక్ష్మణ్, మురికి శ్రీనివాస్, లక్కాకుల భగవంతరావ్, సయ్యద్ ఆ సిఫ్, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్, స్తంబంకాడి మ హేశ్, జెట్టి రాజన్న, మామిడి లింగన్న, భారతపు గుండయ్య, చిరుత మల్లేశం, ఇక్రామ్ ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...