కంటివెలుగుకు అపూర్వ స్పందన


Thu,September 13, 2018 01:16 AM

ముత్తారం: మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో బుధవారం మూడోరోజు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. ఇందులో 180 మంది పాల్గొనగా, 39 మందికి అద్దాలు అందజేశారు. మరో 28 మందికి అద్దాలు అందజేసేందుకు వైద్యాధికారులు రిఫర్ చేశారు. 11 మందికి ఆపరేషన్ కోసం రిఫర్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పరీక్షలు చేపించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది సదానందం, శ్రీనివాస్, వీరేశం, సరళ, కళావతి, సునీత, శశికళ, రజిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మంథని రూరల్: మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం 203 మందికి పరీక్షలు నిర్వహించి 80 మందికి కంటిఅద్దాలను అందజేశారు. కంటివెలుగు శిబిరం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...