మట్టి గణపతే.. మహా గణపతి


Thu,September 13, 2018 01:16 AM

కలెక్టరేట్ : మట్టి గణపతే.. మహా గణపతి అనీ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రామగుండం కాలుశ్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను ఇన్‌చార్జి డీఆర్వో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా 4వేల మట్టి విగ్రహాలను హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగిందనీ, ఎన్టీపీసీకి 300, సింగరేణికి 1900, కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీకి 300, ప్రభుత్వాధికారులు, సిబ్బందికి 200 విగ్రహాలను అందిస్తామని, మిగతా విగ్రహాలను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యావరణశాఖ ఇంజనీర్ కె. రవీందర్, ఏఈ వై. రుత్విక్, కార్యాలయ ఏఓ నాగార్జున, పర్యవేక్షకులు బండి ప్రకాశ్, జయశ్రీ పాల్గొన్నారు.

పెద్దపల్లి : మట్టి వినాయకులకు పూజలు చేసి ప్రతి ఒక్కరూ పర్యావరణను కాపాడుకోవాలని మథర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. కళాశాల ఇంజినీరింగ్, డిప్లామా విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను వేర్వేరుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్, డైరెక్టర్ పవన్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో మెకానికల్ విభాగం అధ్యాపకులు ఉపేందర్, కృష్ణ, శ్రీకాంత్, మనోజ్, వంశీకృష్ణ, శ్రావణ్, కుమార్, శ్రీధర్, డిప్లొమా అధ్యాపకులు పవన్, సూర్యనారాయణ, మహేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్,అనిల్, గౌతమ్, వెంకటేశ్, ఏఓ నరేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి వినాయకులే శ్రేయస్కరం..
పెద్దపల్లి టౌన్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే శ్రేయస్కరమని పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టి వినాయకుల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో వాటిని తయారు చేయించి, పంపిణీ చేశారు. ఇక్కడ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నపూర్ణ, వాసంతి పాల్గొన్నారు.అలాగే, పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఇక్కడ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఎలైట్ కంకటి శ్రీనివాస్, భగవాన్, తిరుపతి, కావేటి రాజగోపాల్, కనుకయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ధర్మారం : మండల కేంద్రంలోని సాయి మణికంఠ పాఠశాల అధ్వర్యంలో మట్టి గణపతులను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు గ్రామంలో ర్యాలీ తీశారు. ఇక్కడ కరస్పాండెంట్ జైన సురేశ్, ఎండీ జైన రమాదేవి, కేర్‌టేకర్ మునీందర్ పాల్గొన్నారు. అలాగే, సాయంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి విగ్రహాలను తయారు చేశారు. ఇక్కడ హెచ్‌ఎం జాడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...